బేతంచర్ల పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ బుగ్గన నాగభూషణ రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి, మూర్తుజావలి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల కనుగుణంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు.