బేతంచర్ల మండల పరిధిలోని ముక్కోటి దేవతలు కలిసి ముచ్చటించుకున్న ముచ్చట్ల మల్లికార్జున శైవ కేత్రంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని.. ఆలయ ఈఓ మద్దిలేటి, ఆధ్వర్యంలో నంది కోళ్ల సేవ వైభవంగా జరిగింది. మంగలవాయిద్యాలతో స్వామివారి ఉత్సవ విగ్రహంతో నంది కోళ్ల సేవ శుక్రవారం ఎంతో ఆకట్టుకుంది.