బేతంచెర్ల: ఘనంగా చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
By K NAGA SRINU 76చూసినవారుబేతంచెర్లలోని గౌరీపేటలో వెలసిన చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి హనుమద్వాహనంపై ఆదివారం ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పూలరథంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుంచి, మంగళ వాయిద్యాలతో హనుమద్వాహనంపై ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో సుజాతశర్మ, హుస్సేన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీరారెడ్డి, రమణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.