సిపిఎం పార్టీ బేతంచెర్ల పట్టణ కమిటి ఆధ్వర్యంలో పట్టణంలో కోటపేటలోని 11, 13 వార్డులలో సిపిఎం పార్టీ శాఖల ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర మంగళవారం నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వైబి. వెంకటేశ్వర్లు ఇంటింటికి వెళ్లి, స్థానిక సమస్యలు డ్రైనేజీ, రోడ్లు, ఉపాధి, మౌలిక వసతులు మొదలగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ప్రజలను చైతన్యయాత్ర నిర్వహించారు.