బేతంచెర్ల మండలం ఆర్ఎస్. రంగాపురం గ్రామంలో శనగ పంటలో పంట కోత ప్రయోగం మంగళవారం నిర్వహించారు. ఈ పంట కోత ప్రయోగంకు డోన్ ఎడిఎ అశోక్ వర్ధన్ రెడ్డి సూపర్వైజేషన్ చేశారు. ఆ తరువాత అంబాపురం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి, అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. బేతంచెర్ల మండల వ్యవసాయాధికారి జి. కిరణ్ కుమార్, ఎఈవోలు మహమ్మద్ తెలిపారు.