రాష్ట్రంలో ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం సరికాదని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వైబి వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మధు శేఖర్, సిఐటియు నాయకులు రామాంజనేయులు, ఖాజాలు డిమాండ్ చేశారు. గురువారం బేతంచెర్ల పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ కాలనీలో, స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉండగా సిపిఎం పార్టీ నాయకులు అక్కడికి వెళ్లి, స్మార్ట్ మీటర్లు బిగించకూడదని, వాటిని ధ్వంసం చేశారు.