బేతంచెర్ల: ఛైర్మన్ చొరవతో తాగునీటి సమస్యకు పరిష్కారం

50చూసినవారు
బేతంచెర్ల: ఛైర్మన్ చొరవతో తాగునీటి సమస్యకు పరిష్కారం
బేతంచెర్ల పట్టణంలోని సంజీవ నగర్ కాలనీలో, వేసవి కాలం ప్రారంభం నుంచి సుమారుగా 150 కుటుంబాలకు అరకొరగా తాగునీరు వస్తుండటంవల్ల, సంజీవ నగర్ కాలని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను కాలనీవాసులు బేతంచెర్ల నగర పంచాయతీ చైర్మన్ సిహెచ్. చలం రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన సొంత నిధులు వెచ్చించి, గతంలో ఉన్న బోరుబావి నుంచి, పైపులైను ఏర్పాటు చేయడంతో బుధవారం తాగునీటి సమస్య పరిష్కారమైంది.

సంబంధిత పోస్ట్