సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విద్యాబోధకుడు రాఘవేంద్రగౌడ్ సూచించారు. వైద్యాధికారులు నితీశ్, వాణిశ్రీ ఆదేశాలతో ప్యాపిలీ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వ్యాధులపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మల్లేశ్వరి, శోభారాణి, సునీత, నాగమణి తదితరులు పాల్గొన్నారు.