అనాథ శవానికి అంత్యక్రియలు

76చూసినవారు
అనాథ శవానికి అంత్యక్రియలు
ప్యాపిలి మండలంలోని చండ్రపల్లె గ్రామంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి (70) మృతి చెందారు. గత వారం రోజుల నుంచి గ్రామంలో బిక్షాటన చేసుకుంటూ జీవనాన్ని సాగించేవాడు. శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామ సర్పంచ్, తెదేపా నాయకుల సహకారంతో పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, వీఆర్వో పురుషోత్తం, పోలీసుల సమక్షంలో ఆ అనాథ శవానికి గ్రామ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్