బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం అందుకు ప్రోత్సహించిన వారు కూడా బాల్యవివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం రూల్స్ 2023 ప్రకారం శిక్షార్హులని డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ తెలిపారు. గురువారం పట్టణంలో డోన్ మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ స్థాయి బాల్య వివాహాల నిర్మూలనపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్స్ పద్మ, పరమేశ్వరీలు పాల్గొన్నారు.