సివిల్ సప్లై గోడౌన్ ఇన్ ఛార్జ్ పై చర్యలు తీసుకోవాలని సోమవారం బిఎస్ఎఫ్ విజయభాస్కర్ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు, ఐసిడిఎస్ అంగనవాడి సెంటర్లకు, ప్రభుత్వ హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. అయితే ఒక్కో ప్యాకెట్ కు 50 కేజీలు ఉండాలన్నారు. అక్కడ ఉన్న ఇన్ ఛార్జ్, హామాలీలు కలిసి ఒక్కో ప్యాకెట్ కి నాలుగు కేజీల నుండి 5 కేజీల వరకు బియ్యం నొక్కేస్తున్నారు. కావున తక్షణమే విచారణ చేసి వారిని తొలగించాలని వారు కోరారు.