డోన్ పట్టణ అగ్నిమాపక కేంద్రంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డోన్ అగ్నిమాపక శాఖ అధికారి రంగసామి గౌడ్ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ఆర్టీసీ డిఎం ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాథమిక దశలో మంటలను ఎలా ఆర్పాలో ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్నిమాపక సిబ్బంది చేసిన నీటి విన్యాసాలను పట్టణ ప్రజలు ఆసక్తికరంగా తిలకించారు.