డోన్ నియోజకవర్గం బేతంచెర్ల గౌరీపేటకు చెందిన షేక్ జాకీయా బేగం హత్య కేసులో ఆమె భర్త షేక్ రసూల్‌ను మంగళవారం అరెస్ట్ చేసినట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. అనుమానంతో గొడవపడి చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్టు విచారణలో వెల్లడైంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గొర్లగుట్ట సమీపంలో అరెస్ట్ చేశారు. రసూల్‌ను రిమాండ్‌కు పంపినట్టు పేర్కొన్నారు.