డోన్ మండలం ఉడుములపాడు గ్రామ శివారులో గ్రామ పెద్ద ఉప్పరి రామాంజనేయులు మంగళవారం ఎడ్ల పందాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశిరెడ్డి నాయన ఆలయ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఎడ్ల పందాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచ్ ఉప్పరి రాధమ్మ తెలిపారు. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.