డోన్ పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్డీవో, ఎంపీడీవో, నేషనల్ హైవే, ఇరిగేషన్, ఫారెస్ట్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ సమస్యలు, నీటి నిల్వ సామర్థ్యం, రహదారి విస్తరణపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.