డోన్: పట్టణాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం

71చూసినవారు
డోన్: పట్టణాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం
డోన్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో కీలకమని బుధవారం చైర్మన్ సప్తశైల రాజేష్ అన్నారు. పాత బస్టాండ్ వద్ద రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వెజిటేబుల్ మార్కెట్ పనులు త్వరలో పూర్తి చేస్తామని, ఫస్ట్ ఫ్లోర్ కౌంటర్లు బహిరంగ వేలం ద్వారా కేటాయిస్తామని తెలిపారు. హిందూ స్మశాన వాటికకు రూ. 10 లక్షలు కేటాయించారని చెప్పారు. ఈ నెల 16న మంత్రి పర్యటన నేపథ్యంలో అవసరమైన మౌలిక వసతులపై నివేదిక తయారు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్