డోన్ పట్టణం పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి జీవితం పొందాలన్నారు.