డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల మండల కేంద్రంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కూటమి కార్యకర్తలతో ముఖాముఖీ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలతో సమాలోచనలు జరిపి, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలను చర్చించారు. అలాగే, స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటానని అన్నారు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.