డోన్ మండలం చిన్నమల్కాపురానికి చెందిన మధుకుమార్ కు బ్యాంకాక్ లో కిడ్నాప్ చేశారని సీఎం చంద్ర బాబు దృష్టికి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తీసుకెళ్లారు. గురువారం శ్రీశైలానికి వచ్చిన చంద్రబాబుతో కోట్ల మాట్లాడారు. డీజీపీ, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లి కిడ్నాప్ అయిన యువకుడ్ని తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.