కోడుమూరు పట్టణంలోని శ్రీచౌడేశ్వరి దేవి అమ్మవారి జాతర సందర్భంగా బుధవారం స్లో సైకిల్ రేస్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. కోట్ల సర్కిల్ నుంచి సంత మార్కెట్ వరకు సాగిన ఈ పోటీలను డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. గెలుపొందిన వారికి కొత్త సైకిల్, రూ. 3, 016, రూ. 2, 016 బహుమతులు ఇవ్వనున్నారు. కోడుమూరు సర్పంచ్ భాగ్యరత్న, కోడుమూరు సీఐ తబ్రేజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.