డోన్ పరిధిలోని శ్రీ మద్దులేటీ స్వామి దేవస్థానంలో శ్రీ స్వామి అమ్మవార్ల హుండీలలో భక్తులు సమర్పించిన ముడుపులు కానుకలను సోమవారం లెక్కింపు చేశారు. దేవాలయ కార్య నిర్వహణ అధికారి ఎం రామాంజనేయులు, దేవాదాయ అధికారి వి. గోపి దేవస్థానం సిబ్బందితో కలిసి హుండీల లెక్కింపు జరిగింది. జరిగిన 28 రోజులకు 16 లక్షల 26 వేల 154 రూపాయలు నగదు, 14 గ్రాముల 464 మిల్లి గ్రాముల బంగారు, 344 గ్రాముల 593 మిల్లిగ్రాముల వెండి వచ్చిందన్నారు.