బేతంచెర్ల ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోట్ల

169చూసినవారు
బేతంచెర్లలోని శేషారెడ్డి ప్రభుత్వ వైద్య శాలను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. కాన్పుల వార్డులో గర్భిణులు, బాలింతల వద్దకు వెళ్లి సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారిణి సాగరిక విధులకు హాజరు కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. వైద్య సేవలు సక్రమంగా అందేలాగా చూడాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, వైద్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్