బేతంచెర్ల రంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనందు డాక్టర్ విజయ భాస్కర్ అధ్యర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ వ్యాధి పై ప్రజలకు అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఆర్ధోవైరస్ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగ్యూ వైరస్ ల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది మనిషి నుండి మనిషికి ఏడిస్ ఈజిప్టై దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఈ జాతి దోమపైన నల్లటని, తెల్లని చారలు ఉండుట వలన దీనిని టైగర్ దోమ అనికూడా పిలుస్తారు.