ప్రారంభమైన మొహర్రం కొలువుదీరిన పీర్ల స్వాములు

85చూసినవారు
ప్రారంభమైన మొహర్రం కొలువుదీరిన పీర్ల స్వాములు
ప్యాపిలి మండల పరిధిలోని కొమ్మేమర్రి గ్రామంలో మొహరం వేడుకలు ప్రారంభం అయ్యాయి. బుధవారం రాత్రి ముజావర్ దస్తగిరి,  పీర్లదేవస్థానం కమిటిసభ్యులు నజీర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి రాత్రి పీర్లను అలంకరించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. పీర్లదేవస్థానం కమిటిసభ్యులు నజీర్ మాట్లాడుతూ ఆది, సోమ, మంగళవారాల్లో పీర్ల ఊరేగింపు ఉంటుందని భక్తి శ్రద్ధలతో అధికసంఖ్యలో భక్తులు పాల్గొనాలని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్