కంబదూరు మండలం నూతన ఎస్ఐగా ఎంకే ప్రవీణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ ప్రవీణ్ కు కంబదూరు పోలీసు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. గతంలో పనిచేసిన ఎస్ఐ పెద్దవడుగూరుకు బదిలీ కాగా ఆయన స్థానంలో కుప్పం నుంచి కంబదూరుకు ప్రవీణ్ బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ ప్రవీణ్ మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించే విధంగా పనిచేస్తానన్నారు. అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానన్నారు.