పెన్షన్ డబ్బుల కోసం కన్న తండ్రినే చంపాడు!

1103చూసినవారు
పెన్షన్ డబ్బుల కోసం కన్న తండ్రినే చంపాడు!
పెన్షన్ డబ్బుల కోసం గొడవపడి ఓ వ్యక్తి కన్న తండ్రినే హతమార్చాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో చోటు చేసుకుంది. దర్గాలయ్య అనే వ్యక్తికి నిన్న పింఛన్ డబ్బులందాయి. పింఛన్ డబ్బుల కోసం దర్గాలయ్యకు అతని కుమారుడు నాగశేషులుకు గొడవ జరిగింది. మద్యం మైకంలో ఉన్న నాగశేషులు.. తండ్రి దర్గలయ్యపై కర్రతో దాడి చేసి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్