కోడుమూరులో 10 లీటర్ల నాటుసారా పట్టివేత

54చూసినవారు
కోడుమూరులో 10 లీటర్ల నాటుసారా పట్టివేత
కోడుమూరు సెబ్ పరిధిలోని వెల్దుర్తి మండలం ఎల్. బండ తండాలో గోపాల్ నాయక్ బైక్ పై తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సెబ్ సీఐ రామాంజనేయులు బుధవారం తెలిపారు. గోపాల్ నాయక్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని వెల్లడించారు. 10 లీటర్ల సారా, బైక్ ను సీజ్ చేసినట్లు చెప్పారు. దాడుల్లో సెబ్ సిబ్బంది హనుమంతు, విరుపాక్షిరెడ్డి, శంకర్ నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్