కావలికి చెందిన పోతురాజు శాంతి పవన్ కుమార్ (59) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. బంగారం తక్కువ ధరకే అమ్ముతానంటూ రూ.7.32 కోట్లు మోసం చేసిన కేసులో రిమాండ్‌లో ఉండగా, కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కర్నూలులో బాధితుడిని బెదిరించి రూ.50 వేలు లాక్కున్న ఘటనలో కూడా నిందితుడిపై కేసుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా విచారిస్తున్నారు.