సి. బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాలతో ప్రతి ఇంటికి తిరుగుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, దీపం పథకం, తల్లికి వందనం వంటి పథకాలు అమలుపై ప్రజా అభిప్రాయాలను సేకరించారు.