బి. తాండ్రపాడు: యువతకు ఉపాధితోనే ఉజ్వల భవిష్యత్

60చూసినవారు
బి. తాండ్రపాడు: యువతకు ఉపాధితోనే ఉజ్వల భవిష్యత్
కర్నూలు మండలం బి. తాండ్రపాడు ప్రభుత్వ ఐటీఐలో జిల్లా ఉపాధి కల్పనా శాఖ, సెట్కూరు ఆధ్వర్యంలో గురువారం వృత్తి మార్గదర్శకత్వం, డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. ఉపాధి కల్పనాధికారి సోమశివారెడ్డి, సెట్కూరు సీఈవో వేణుగోపాల్ మాట్లాడుతూ యువత పట్టుదలతో ముందుకెళితే పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, బ్యాంకులు స్వయం ఉపాధికి రుణాలు ఇస్తున్నాయని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్