కర్నూలు జిల్లా గూడూరు మండలం జులకల్ మోడల్ స్కూల్ విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయమని శనివారం బీజేపీ మండలాధ్యక్షుడు పొన్నకల్ వెంకటేష్, కర్నూలు డిపో-2 మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. స్కూల్ వేళల మార్పు వల్ల, బాలికలకు ఇంటికి చేరుకోవడంలో రవాణా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు 5: 00 గంటలకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.