పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎంతో శ్రేష్టమని కోడుమూరు కోలోకేటెడ్ పీహెచ్సీ సూపర్వైజర్ కమాల్ సాహెబ్, గూడూరు డాక్టర్ షఫియా బేగం, డాక్టర్ ప్రతుషా కృష్ణారెడ్డి సూచించారు. గురువారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కోడుమూరు, గూడూరు పట్టణాల్లో అంగన్వాడీ సెంటర్లలో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఉపయోగాలపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడారు. ప్రతి తల్లి పుట్టిన వెంటనే బిడ్డ ముర్రుపాలు ఇవ్వాలని సూచించారు.