ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా నిరాశ్రయ కుటుంబాలకు జీవనజ్యోతి ఆధారమని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఆసిఫ్ అన్నారు. శుక్రవారం సి. బెళగల్ మండలంలో పోలకల్ కు చెందిన యు.పార్వతమ్మకు పీఎంజేజేబివై కింద రూ. 2 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఆమె భర్త ఉలిగి సోమప్ప గుండెపోటుతో మరణించడంతో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు సోమప్ప భార్యకు ఈ బీమా చెక్కును అందించారు.