కోడుమూరు నియోజకవర్గంలోని సి. బెళగల్ మండల కేంద్రంలోని చెరువు స్థలం, ఫీల్డ్ ఛానల్ కబ్జా చేసి తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకున్నారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఆక్రమణలపై శుక్రవారం కర్నూలులో జిల్లా ఇంచార్జి కలెక్టర్, జేసీ డా. బి. నవ్య సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆక్రమణ తక్షణమే తొలగించాలని జాయింట్ కలెక్టర్ బి. నవ్య జలవనరుల అధికారులను ఆదేశించారు.