సి. బెళగల్ మండలంలోని కొండాపురంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి బయట నిలిపిన బైక్‌కు నిప్పుపెట్టారు. మంగళవారం బాధితుడు శాంసన్ అలియాస్ చిన్న నాగరాజు సోమవారం రాత్రి బైక్ పార్క్ చేసి ఇంట్లో నిద్రించగా, బైక్ మంటల్లో కాలిపోతుండటాన్ని స్థానికులు గమనించి, తెలిపినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసిన బైక్ దగ్ధమైంది. కేసు నమోదు చేసి ఎస్సై తిమ్మారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.