సి. బెళగల్‌లో రూ. 3 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన

58చూసినవారు
సి. బెళగల్‌లో రూ. 3 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన
సి. బెళగల్ మండలంలో అభివృద్ధి పనులకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం భూమిపూజ నిర్వహించారు. రూ. 3 కోట్ల నాబార్డు నిధులతో సంగాల వరకు బీటీ రోడ్డు నిర్మాణాన్ని, రూ. 99 లక్షల జలజీవన్ మిషన్ ట్యాంక్ నిర్మాణాన్ని ప్రారంభించారు. టీడీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్