సి. బెళగల్ మండలంలో నూతన తహశీల్దార్‌గా వెంకటలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు అర్బన్ తహశీల్దార్‌గా పనిచేసిన ఆమె బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని, మండల అభివృద్ధికి తన వంతు పాత్రను నిబద్ధతతో నిర్వర్తిస్తానని తెలిపారు.