గూడూరు పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాలలో చైర్ మన్ నాగరాజు, వైస్ చైర్ మన్ మధు, హెచ్ఎం ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కర్నూలు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్, మాజీ కేడిసిసి డైరెక్టర్ రాజారెడ్డి, వాల్మీకి సంఘము ఉపాధ్యక్షులు సంగాల మధు, మాజీ కౌన్సిలర్ నర్సింహులు పాల్గొని, మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.