ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: పీడీ సిద్ధలింగమూర్తి

71చూసినవారు
ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: పీడీ సిద్ధలింగమూర్తి
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని హౌసింగ్ పీడీ సిద్ధలింగమూర్తి తెలిపారు. బుధవారం కోడుమూరు మండలం ప్యాలకుర్తి లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలను పీడీ పరిశీలించి అధికారులను అడిగి పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం లబ్దిదారులతో మాట్లాడారు. వందరోజుల కార్యాచరణతో పనులు పూర్తి చేయడానికి సంసిద్ధం కావాలని కోరారు. డీఈ వాసుదేవరావు, వర్క్ ఇన్స్పెక్టర్ అఫ్రోజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్