కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు రూరల్ మండలం టీవీ9 కాలనీలో ఆదివారం వైసీపీ సీనియర్ నాయకుడు సంధ్య విక్రమ్ కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, పదోతరగతి వరకు హైస్కూల్ ఏర్పాటు చేయాలని, ఆడబిడ్డల చదువుకు పంపే పరిస్థితిలోలేమని పలువురు కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు.