కోడుమూరు మండలం కొత్తపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పొలంలో విద్యుత్ ప్రమాదంతో ఎద్దు మృతి చెందగా, రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలోని పంట పొలంలో కొత్తపల్లికి చెందిన బోయ రవి తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా అక్కడే పడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఎద్దు మృతి చెందింది. రైతుకు కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.