కోడుమూరు మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు, వర్షం ప్రభావంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. సంత మార్కెట్ సమీపంలో బజారి, సాలమ్మ దంపతుల పూరి గుడిసె గోడ కూలి, రేకులు లేచి పడ్డాయి. అప్రమత్తమైన కుటుంబం చిన్నారులతో బయటికి రావడంతో ప్రమాదం తప్పింది. మండలంలో 33. 6 మి. మీ వర్షపాతం నమోదైంది. ఎస్సీ, బీసీ కాలనీల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయి, సరఫరాలో అంతరాయం ఏర్పడింది.