రైతులు వ్యవసాయాధికారుల సలహాలు పాటించాలి

82చూసినవారు
రైతులు వ్యవసాయాధికారుల సలహాలు పాటించాలి
రైతులు వ్యవసాయాధికారుల సలహాలను తప్పక పాటించాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీలత సూచించారు. బుధవారం సి. బెళగల్ మండలంలోని బురాన్ దొడ్డి రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి మల్లేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో లింగా కర్షణ బుట్టల గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం బురానదొడ్డి గ్రామంలో వెంకటలక్ష్మమ్మ సాగు చేసిన పత్తి పంటను పరిశీలించారు. పత్తి సాగు చేస్తున్న రైతులకు ఆమె లింగాకర్షణ బుట్టలను అందజేశారు.

సంబంధిత పోస్ట్