నందవరం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ దేశాయ్ మాధవరావ్ టీడీపీ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశానని తెలిపారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధనబలం ఉన్నవారికే నామినేటెడ్ పదవులు లభిస్తున్నాయని విమర్శించారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీ లో విలువ లేదని అన్నారు.