కోడుమూరు మండలంలో గుండెపోటుతో మాజీ సర్పంచ్ ఈశ్వరరెడ్డి మృతి

56చూసినవారు
కోడుమూరు మండలంలో గుండెపోటుతో మాజీ సర్పంచ్ ఈశ్వరరెడ్డి మృతి
కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అచ్చిరెడ్డిగారి ఈశ్వరరెడ్డి (55) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మధ్యాహ్నం ఇంట్లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈశ్వరరెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్