గుండెపోటుతో వర్కూరు మాజీ సర్పంచ్ మృతి

68చూసినవారు
గుండెపోటుతో వర్కూరు మాజీ సర్పంచ్ మృతి
కోడుమూరు మండలంలోని వర్కూరుకు చెందిన మాజీ సర్పంచ్ ఈశ్వరరెడ్డి (55) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఇంట్లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈశ్వరరెడ్డి మృతి వార్త తెలిసి మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కుడా చైర్ మన్ కోట్ల హర్షవర్థన్ రెడ్డి, ఆదిమూలపు సతీష్, జడ్పీటీసీ రఘునాథరెడ్డి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్