గార్గేయపురం: పొగాకు రైతులు ధర్నా

57చూసినవారు
గార్గేయపురం: పొగాకు రైతులు ధర్నా
పొగాకు కొనుగోలు చేస్తామన్న హామీలను కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం కోడుమూరు నియోజకవర్గంలోని గార్గేయపురం చెరువు వద్ద ఉన్న జీపీఐ, ఐటీసీ, వీఎస్‌టీ, బొమ్మిడి కంపెనీల ఎదుట ఉల్చాల, రేమట గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. నెలలుగా కొనుగోలు కోసం కంపెనీల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదని ఆరోపించారు. కలెక్టరేట్‌లో అధికారులు స్పందించాలని వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్