సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టీడీపీ నియోజకవర్గం పరిశీలకులు రామలింగారెడ్డి శనివారం గూడూరు మండలం గుడిపాడులో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో నిర్వహించారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. సూపర్ సిక్స్ పథకాలపై ఇంటింటికి వెళ్లి తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్న క్యాంటీన్ పునరుద్ధరణ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను వివరించారు.