కోడుమూరులో హిందూ సామ్రాజ్య దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు షణ్ముఖమాచారి, విశ్వహిందూ పరిషత్ నాయకులు సల్వాడి సురేంద్ర పాల్గొన్నారు. సురేంద్ర మాట్లాడుతూ శివాజీ మహారాజు భారతీయుల ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు.