కోడుమూరు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ గాడి రూతమ్మ, జెడ్పిటీపీ రఘునాథెడ్డి, ఎంపీడీవో చంద్రశేఖర్, కోడుమూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేష్ నాయక్, మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచు భాగ్యరత్న, పోలీసుస్టేషన్ లో సీఐ మన్సురుద్దీన్, సెబ్ స్టేషన్ లో సీఐ రామాంజినేయులు జెండాను ఎగురవేశారు. మోడల్ స్కూల్ లో విద్యార్థులకు ప్రిన్సిపాల్ జ్ఞాపికలను అందజేశారు.